Movie Reviews

ఖైదీ నంబర్‌ 150 రివ్యూ..

chiranjeevi-khaidi-no-150-movie-review-rating

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీయంట్రీ ఇచ్చిన తీసిన సినిమా ఖైదీ నంబర్ 150. బుధవారం ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలైంది.. మరి మునుపటి వాడి సినిమాలో ఉందా.. కథేంటి.. డ్యాన్సులు, ఫైట్స్ గట్రా చిరు ఇరగదీశాడా..? ఆడియోన్స్ పల్స్ ఏంటి అనే వాటిపై రివ్యూ చూద్దాం..

·         కథేంటంటే:

కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.

·         మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.

·         శంకర్‌కు సన్మాన కార్యక్రమంతో.. అతడి పూర్వాపరాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.

 ఎలా ఉందంటే:

 వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది కత్తికి రీమేక్‌. అయితే చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్‌నీ బాగా చిత్రీకరించారు. అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూపాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. రత్తాలూ..‘ ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరోపాటలు హుషారెక్కిస్తాయి. అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూకుర్రకారుతో ఈలలేయిస్తుంది.

 ఎవరెలా చేశారంటే:

తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్‌ అందంగా కనిపించింది. దర్శకుడిగా వి.వి. వినాయక్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. కామెడీ పండించారు.. మొత్తంగా సినిమా చూసిన అభిమానులు సంభ్రమాశ్చార్యాలకు లోనవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కితాబిస్తున్నారు..

 బలాలు :

  చిరంజీవి

  కథ.. కథనం

 పాటలు.. డ్యాన్సులు

 ఉద్వేగభరిత సన్నివేశాలు

బలహీనతలు :

    బలమైన విలన్ పాత్ర లేకపోవటం

 చిరు ఖైదీనంబర్ 150 మూవీకి రేటింగ్: 4/5 


This article was first and originally published at Source link . All contents are owned by respective authors.

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

5,739 Comments

Click here to post a comment