Movie News

ANR’s Hit Song Remix by Sushanth

ANR's Hit Song Remix by Sushanth

ANR’s Hit Song Remix by Sushanth

‘ఆటాడుకుందాం..రా’ చిత్రంలో
డా|| అక్కినేని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ ‘పల్లెకు పోదాం..పారు చూద్దాం’ రీమిక్స్‌…

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రానికి సంబంధించి పాటలు మినహా టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంకోసం నటసామ్రాట్‌ డా|| అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలోని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో’ పాటని రీమిక్స్‌ చేశారు. ఇటీవల పోచంపల్లి, రామోజీ ఫిల్మ్‌ సిటీలో శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో నాలుగురోజులపాటు ఈ పాటను చిత్రీకరించారు.

ఈ సందర్భంగా, 

నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన ఎవర్‌గ్రీన్‌ సినిమా ‘దేవదాసు’. ఈ చిత్రంలోని ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో’ అప్పటికీ, ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌నే వుంది. ఆ పాటను మా చిత్రం రీమిక్స్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. హీరో సుశాంత్‌, హీరోయిన్‌ సోనమ్‌ ప్రీత్‌లపై శేఖర్‌ మాస్టర్‌ నృత్యదర్శకత్వంలో నాలుగు రోజులపాటు చిత్రీకరించడం జరిగింది. పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నాలుగు పాటల్ని ఫారిన్‌లో తీస్తాం. ఆల్రెడీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

హీరో సుశాంత్‌ మాట్లాడుతూ – ”తాతగారి ‘దేవదాసు’ చిత్రంలోని పాటను రీమిక్స్‌ చేయడం, ఆ పాటలో నేను నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటను షూట్‌ చేస్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్‌ అయ్యాను. శేఖర్‌ మాస్టర్‌గారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ పాటను తీశారు. ఈ పాట ఈ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది” అన్నారు.

నిర్మాత ఎ.నాగసుశీల మాట్లాడుతూ – ”ఆటాడుకుందాం రా’ చిత్రం సుశాంత్‌కి చాలా మంచి పేరు తెస్తుంది. డైరెక్టర్‌ నాగేశ్వరరెడ్డిగారు సుశాంత్‌ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఈ చిత్రంలో నాన్నగారి ‘దేవదాసు’ చిత్రంలోని ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో’ పాటను రీమిక్స్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ పాటకు సుశాంత్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా చాలా బాగా చేశాడు. ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది” అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”డా|| నాగేశ్వరరావుగారి ‘దేవదాసు’ చిత్రంలోని పాటను మా చిత్రంలో రీమిక్స్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటను సుశాంత్‌ చాలా బాగా చేశాడు. సుశాంత్‌కి ఇది మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలో సెంటిమెంట్‌, ఎమోషన్‌తోపాటు అందర్నీ థ్రిల్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా వున్నాయి. సుశాంత్‌కి ‘ఆటాడుకుందాం రా’ పెద్ద హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసి, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర,

ఎడిటింగ్‌: గౌతంరాజు,

ఆర్ట్‌: నారాయణరెడ్డి,

ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర,

ఛీఫ్‌ కో-డైరెక్టర్‌. డి.సాయికృష్ణ,

కో-డైరెక్టర్‌: కొండా ఉప్పల,

ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రవికుమార్‌ యండమూరి,

కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన,

నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల,

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.​


Source link

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

5,739 Comments

Click here to post a comment