Movie News

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న విష్ణు-సురభి!

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. సదరు సన్నివేశం ట్రాఫిక్ జామ్ లో చిత్రీకరించి ఉండాల్సి రావడంతో పెద్ద సంఖ్యలో వెహికిల్స్ ను ఏర్పాటు చేశారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపటితో రెండోభారీ షెడ్యూల్ పూర్తికానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. నేడు రామోజీ ఫిలిమ్ సిటీలో వేయబడిన ప్రత్యేకమైన సెట్ లో హీరోహీరోయిన్ల నడుమ లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నాం. అలాగే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపాం. మంచు విష్ణుకి కథానాయకుడిగా మంచి పేరు తీసుకురావడంతోపాటు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో బైలింగువల్ సినిమాగా రూపొందిస్తున్నాం. దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ తో మా యూనిట్ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమన్ నేతృత్వంలో పాటల కంపోజింగ్ కూడా జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం అన్నారు.

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

Add Comment

Click here to post a comment