Movie News

Raj Tarun Next Movie Titled as “Raju Gadu – Yama Danger”

Raj Tarun Next Movie Titled as "Raju Gadu - Yama Danger"

Raj Tarun Next Movie Titled as “Raju Gadu – Yama Danger”

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్,మారుతి ‘రాజుగాడు’గా రాజ్ తరుణ్
హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై తెరకెక్కిన ‘ఆడోరకం ఈడోరకం’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించిన రాజ్ తరుణ్.. మరోసారి ఇదే బ్యానర్ లో తన తదుపరి సినిమా కమిటైయ్యాడు. నేటి నుంచే హైదరాబాద్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి రాజుగాడు (ట్యాగ్ లైన్ – యమ డేంజర్) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఏక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో 9వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లేడైలాగ్స్ ను ప్రముఖ దర్శకుడు మారుతి అందిస్తున్నారు. మారుతి మార్క్ కామెడీతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తోందని. అలానే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తోందని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర తెలిపారు. సితార, ప్రవీణ్, మురళీ శర్మ, హేమ, తాగుబోతు రమేష్ తదితరలు నటిస్తున్న ఈ సినిమాతో సంజన అనే నూతన దర్శకురాలు తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు డైలాగ్స్ రవి వర్మ నంబూరి అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫీ-నజీర్ షఫీ(భలే భలే మగాడివోయ్ ఫేమ్), ఆర్ట్-కృష్ణమయ,మ్యూజిక్ గోపి సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-కిషోర్ గరికిపాటి, కో ప్రొడ్యూసర్-అజయ్ సుంకర, సమర్పణ : ఏ టీవి, ప్రొడ్యూసర్-సుంకర రామబ్రహ్మం.


Source link

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

Add Comment

Click here to post a comment